Type Here to Get Search Results !

IDBI బ్యాంకులో 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ప్రభుత్వ ఉద్యోగాలు..ఫిబ్రవరి 26 చివరి తేదీ...

👉IDBI Recruitment Notification 2024: దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఐడీబీఐ 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది.

👉జోన్లు: అహ్మదాబాద్, భోపాల్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబయి, నాగ్పుర్, పుణె, భువనేశ్వర్, పట్నా, చండీగఢ్, దిల్లీ, కోల్కతా, లఖ్నవూ.

👉పోస్టులు & ఖాళీల వివరాలు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఓ): 500 పోస్టులు (యూఆర్- 203, ఎస్సీ- 75, ఎస్టీ- 37, ఈడబ్ల్యూఎస్- 50, ఓబీసీ- 135)

👉అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 31/01/2024 నాటికి 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఇస్తారు.

👉శాలరీ : ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలం (6 నెలలు) లో నెలకు రూ.5000 ఇస్తారు. ఇంటర్న్షిప్ (2 నెలలు) సమయంలో నెలకు రూ.15 వేలు చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరినవారికి రూ.6.14 నుంచి రూ.6.50 లక్షల వరకు వార్షిక వేతనం అందుతుంది.

👉దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 చెల్లించాలి.

👉ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చిన వారు పర్సనల్ ఇంటర్వ్యూలకు అర్హత సాధిస్తారు. అందులో ప్రతిభ, ధ్రువపత్రాల పరీశీలన, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపికలు చేపడతారు.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 26, 2024

👉Websitewww.idbibank.in


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments