👉Reliance jobs: దిల్లీ: ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది.
👉 తమ కంపెనీలోని వివిధ విభాగాల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించుకునేందుకు గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది.
👉ఇందులో భాగంగా పెట్రో కెమికల్ నుంచి న్యూ ఎనర్జీ వరకు రిలయన్స్ కు చెందిన వివిధ వ్యాపార విభాగాల్లో ఉద్యోగావకాశాలను కల్పించనుంది.
👉క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించే కంపెనీలు కొన్ని విద్యా సంస్థలకే పరిమితమవుతున్నాయని, దీనివల్ల టాప్ 50 లేదా టాప్- 100 సంస్థల విద్యార్థులకే అవకాశాలు లభిస్తున్నాయని రిలయన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
👉 దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను చేపట్టినట్లు తెలిపింది.
👉 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ (GET) 2024 పేరిట ప్రారంభించిన ఈ డ్రైవ్లో భాగంగా జనవరి 11 నుంచి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
👉బీటెక్, బీఈ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉ఏఐసీటీఈ ఆమోదం పొందిన విద్యా సంస్థల నుంచి కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉 షార్ట్ లిస్ట్ చేసిన విద్యార్థులకు ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు.
👉 అందులో ఎంపికైన వారిని ఫిబ్రవరి 23 నుంచి మార్చి 11 వరకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేస్తారు.
👉 మార్చి నెలాఖరుకు ఈ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.
👉రిలయన్స్ అందిస్తున్న ఈ సదావకాశాన్ని ఇంజినీరింగ్ విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
👉 పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడగలరు..
👉Website :
👉 అందులో అర్హత, నియామక ప్రక్రియ, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వివరాలను అందులో పొందుపరిచింది.
👉 అభ్యర్థులు 10, 12, డిప్లొమాలో 60 శాతం మార్కులు లేదా 6 CGPA సాధించి ఉండాలి.
👉 ఇంజినీరింగ్లో 60 శాతం (ఏడో సెమిస్టర్/ గ్రాడ్యుయేషన్) మార్కులు సాధించిన వారు అర్హులు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: