👉IGNOU Recruitment Notification 2023:
👉మొత్తం ఖాళీలు : 102
1.జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (జేఏటీ)-50
▪️అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు 10+2 లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి.
కంప్యూటర్ పై ఇంగ్లిష్ నిమిషానికి 40 పదాలు/హిందీలో నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలగాలి. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
▪️వయసు: 21.12.2023 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
2.స్టెనోగ్రాఫర్ పోస్టులు -52
▪️అర్హత: ఇంటర్మీడియట్ లేదా 10+2 తత్సమాన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్పై ఇంగ్లిష్లో నిమిషానికి 40 పదాలు /హిందీలో నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలగాలి. షార్ట్యండ్లో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణత సాధించి, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
▪️వయసు: 21.12.2023 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్సీఎల్)కు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 ఏళ్లు, ఎక్ససర్వీస్మెన్కు వారికి మూడేళ్ల సడలింపు లభిస్తుంది.
👉శాలరీ:
▪️ జూనియర్ అసిస్టెంట్-కమ్ టైపిస్ట్(జేఏటీ) పోస్టులకు ఎంపికైన వారికి లెవల్-2 ప్రకారం-ప్రతి నెల రూ.19,900- 63,200 వరకు వేతనం అందుతుంది.
▪️అదేవిధంగా స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఎంపికైన వారికి లెవల్-4 ప్రకారం-ప్రతి నెల రూ.25,500-రూ.81,100 వేతనంగా లభిస్తుంది.
👉 ఎంపిక విధానం :
▪️అభ్యర్థుల ఎంపికకు రెండు దశల్లో అర్హత పరీక్షలను నిర్వహిస్తారు. అవి..టైర్-1, టైర్-2 పరీక్షలు.
▪️ టైర్-1: (జేఏటీ, స్టెనోగ్రాఫర్ పోస్టులకు): ఇందులో 5సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్-30 మార్కులు,సెక్షన్-2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్-30 మార్కులు, సెక్షన్-3లో హిందీ/ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్-30 మార్కులు, సెక్షన్-4లో జనరల్ అవేర్ నెస్-30 మార్కులు,సెక్షన్-5 లో కంప్యూటర్ నాలెడ్జ్-30 మార్కులుంటాయి.
▪️ టైర్-2: ఈ పరీక్ష రెండు పోస్టులకు వేర్వేరుగా ఉంటుంది.
👉సిలబస్ వివరాలు :
▪️ మ్యాథమెటికల్ ఎబిలిటీస్: నంబర్ సిస్టమ్స్, ఆల్జీబ్రా, మెన్సురేషన్, టిగ్రనోమెట్రీ, స్టాటిస్టిక్స్- ప్రాబబిలిటీ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
▪️ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్: వెర్బల్-నాన్ వెర్బల్, వెనయాగ్రమ్స్, నంబర్ సిరీస్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్, సోషల్ ఇంటెలిజెన్సీ, వర్డ్ బిల్డింగ్, కోడింగ్-డీకోడింగ్, న్యూమరికల్ ఆపరేషన్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
▪️ ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్:
వొకాబ్యులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటనిమ్స్, స్పాట్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, డిటెక్టింగ్ మిస్ స్పెల్డ్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్, పాసివ్ వాయిస్ ఆఫ్ వెర్బ్స్, కాంప్రహెన్షన్ పాసేజ్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
▪️ జనరల్ అవేర్నెస్: సమాజ పరిస్థితులపై అభ్యర్థుల అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే ఇండియన్ హిస్టరీ, కల్చర్, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక పరిస్థితులను గురించి ప్రశ్నలను అడుగుతారు.
▪️ కంప్యూటర్ నాలెడ్జ్: కంప్యూటర్ బేసిక్స్, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈ-మెయిల్స్, ఈ-బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21/12/2023
👉 దరఖాస్తు ఎడిట్ ఆప్షన్: 2023 డిసెంబర్ 22-25 తేదీల వరకు
👉Website : https://exams.nta.ac.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: