👉Military Nursing Service
Notification:
▪️ మిలటరీ నర్సింగ్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల..
▪️ఎన్టీఏ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహణ
▪️ మలి దశలో ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్
▪️ ఎంపికైతే లెఫ్టినెంట్ హోదాలో నర్సింగ్ ఆఫీసర్ కొలువు
▪️ ప్రారంభ వేతనం: 56,100/- నుంచి 1,77,500/-
👉ఇండియన్ మిలటరీ నర్సింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా ఆర్మీలో నర్సింగ్ విభాగంలో షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో పోస్ట్లను భర్తీ చేస్తారు.
👉 తొలుత అయిదేళ్ల వ్యవధికి నియామకం ఖరారు చేస్తారు. ఆ తర్వాతో మరో అయిదేళ్లకు పొడిగిస్తారు. అభ్యర్థుల ఆసక్తిని బట్టి చివరగా మరో నాలుగేళ్లకు సర్వీసు పొడిగిస్తారు.
👉 ఇలా మొత్తం 14 ఏళ్లపాటు మిలటరీ నర్సింగ్ సర్వీస్లో విధులు నిర్వర్తించే అవకాశం లభిస్తుంది.
👉అర్హతలు: ఎమ్మెస్సీ నర్సింగ్/పోస్ట్ బ్యాక్యులరేట్ బీఎస్సీ(నర్సింగ్)/బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత ఉండాలి. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
👉 వయసు: 2023, డిసెంబర్ 26 నాటికి 21- 35 ఏళ్ల మధ్య ఉండాలి.
👉ప్రతిభే ప్రామాణికం: మిలటరీ నర్సింగ్ సర్వీస్ కు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చిన మార్కులు, అందుబాటులో ఉన్న పోస్ట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని.. ఒక్కో పోస్ట్కు 10 మందిని చొప్పున మలి దశలో ఇంటర్వ్యూకు, మెడికల్ టెస్ట్కు ఎంపిక చేస్తారు. మలి దశ ప్రక్రియను ఇండియన్ ఆర్మీ అధికారులు చేపడతారు.
👉ఎన్టీఏ రాత పరీక్ష: మిలటరీ నర్సింగ్ సర్వీస్ ఎంపిక ప్రక్రియ తొలి దశలో రాత పరీక్షను.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించనుంది. ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా నాలుగు విభాగాల్లో నిర్వహిస్తారు. అవి.. బేసిక్ నర్సింగ్ 30 ప్రశ్నలు-30 మార్కులు, క్లినికల్ స్పెషాలిటీస్ 100 ప్రశ్నలు-100 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ 10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ 10 ప్రశ్నలు-10 మార్కులకు ఉంటాయి.
👉పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 150 ప్రశ్నలు-150 మార్కులకు జరుగుతుంది. ఈ పరీక్షకు కేటాయించిన సమయం రెండున్నర గంటలు.
👉మలి దశ ఇంటర్వ్యూ: రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. మలి దశలో ఇండియన్ ఆర్మీ అధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ మూడు నుంచి అయిదు రోజుల పాటు జరుగుతుంది. అభ్యర్థులకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంగ్లిష్, సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్లు నిర్వహిస్తారు. ఆ తర్వాత మిలటరీ నర్సింగ్ సర్వీస్కు చెందిన ఉన్నతాధికారుల నేతృత్వంలో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయిస్తారు.
👉పర్సనల్ ఇంటర్వ్యూ వివరాలు :
పర్సనల్ ఇంటర్వ్యూలో భాగంగా.. సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థులకున్న సబ్జెక్ట్ నాలెడ్జోపాటు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్పై అవగాహనను పరిశీలిస్తారు. దీంతోపాటు వ్యక్తిగత ఆసక్తి, అలవాట్లుతోపాటు నర్సింగ్ కెరీర్ పట్ల ఉన్న అంకిత భావాన్ని పరిశీలించేలా ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడుగుతారు. అదే విధంగా సైకలాజికల్ అసెస్మెంట్లో భాగంగా.. అభ్యర్థుల వ్యవహార శైలి, వ్యక్తిగత వైఖరి, దృక్పథం వంటి వాటిని పరిశీలిస్తారు. ఇంటర్వ్యూలోనూ ప్రతిభ చూపిన వారికి చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
👉లెఫ్టినెంట్ హోదాతో కొలువు:
ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి తుది నియామకం ఖరారు చేసుకున్న వారికి లెఫ్టినెంట్ హోదాతో కొలువు ప్రారంభం అవుతుంది.
👉మేజర్ స్థాయికి చేరుకునే అవకాశం..నర్సింగ్ ఆఫీసర్లుగా ఎంపికైన వారు.. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో మేజర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. లెఫ్టినెంట్ హోదాలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత కెప్టెన్గా పదోన్నతి లభిస్తుంది. కెప్టెన్ హోదాలో ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటే మేజర్ స్థాయికి చేరుకోవచ్చు.
👉విధులు: మిలటరీ నర్సింగ్ సర్వీస్ కు ఎంపికైన వారు.. దేశ వ్యాప్తంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లోకు చెందిన సైనిక శిబిరాల్లో, ఆర్మీ మెడికల్ హాస్పిటల్స్, అదే విధంగా త్రివిధ దళాలకు సంబంధించి ఆయా సెక్టార్లలో ఉన్న బేస్ క్యాంప్లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 26, 2023
👉అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సదుపాయం: 2024 జనవరి మొదటి వారం
👉 పరీక్ష తేదీ: జనవరి 14, 2024
▪️ తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్
👉 Website : https://exams.nta.ac.in/SSCMNS
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.
👉Telegram Link: