👉POWERGRID Recruitment Notification: మహారత్న కేటగిరీకి చెందిన పవర్డిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) 203 జూనియర్ టెక్నీషియన్ ట్రెయినీ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
👉ఎలక్ట్రిషియన్ ట్రేడ్లో ఐటీఐ (ఎలక్ట్రికల్) పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. ఉన్నత సాంకేతిక అర్హతలైన డిప్లొమా/ బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అనర్హులు. దరఖాస్తు రుసుము రూ.200. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
👉మొత్తం 203 పోస్టుల్లో అన్ ర్రిజర్వుడ్ అభ్యర్థులకు 89, ఈడబ్ల్యూఎస్కు 18, ఓబీసీ (ఎన్సీఎల్)కు 47, ఎస్సీలకు 39, ఎస్టీలకు 10 కేటాయించారు.
👉వయస్సు : 12.12.2023 నాటికి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీ (ఎన్సీఎల్) అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కేటగిరీని బట్టి పదేళ్లు అంతకంటే ఎక్కువ సంవత్సరాల సడలింపు ఉంటుంది.
👉 పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. వ్యవధి 2 గంటలు. ప్రశ్నపత్రంలో రెండు పార్టులుంటాయి.
▪️ పార్ట్-1లో టెక్నికల్ నాలెడ్జ్ (టీకేటీ) 120 ప్రశ్నలు ఉంటాయి.
▪️ పార్ట్-2లో ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏటీ) - 50 ప్రశ్నలకు ఉంటుంది.
▪️ ప్రశ్నకు 1 మార్కు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికీ, ఒకటికంటే ఎక్కువ జవాబులు గుర్తించినా.. పావు మార్కు తగ్గిస్తారు.
▪️పార్ట్-1లోని టెక్నికల్ నాలెడ్జ్ (టీకేటీ) ప్రశ్నలు ఐటీఐ- ఎలక్ట్రిషియన్ ట్రేడ్ సిలబస్కు సంబంధించినవి ఉంటాయి. ఈ సబ్జెక్టుల్లోని ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకుంటే ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. నీ చదివిన సబ్జెక్టులేనని నిర్లక్ష్యం చేయకుండా వాటిలో గట్టి పట్టు సాధించాలి.
▪️ పార్ట్-2లోని ఆప్టిట్యూడ్ టెస్ట్లో భాగంగా..జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
▪️పార్ట్-2లోని ఆప్టిట్యూడ్ టెస్ట్ కోసం.. బ్యాంక్, ఎస్ఎస్సీలాంటి పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయొచ్చు.
▪️ ఆన్లైన్లో అందుబాటులో ఉండే మోడల్ టెస్ట్లనూ రాయడం ద్వారానూ ఈ అంశాలపై పట్టు సాధించవచ్చు.
👉 ఎంపిక విధానం:ఈ పరీక్షలో అర్రిజర్వుడ్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం, రిజర్వుడ్ కేటగిరీ వారు 30 శాతం అర్హత మార్కులు సాధించాలి.
▪️ సీబీటీలో అర్హత సాధించినవాళ్లను డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్టు ఎంపికచేస్తారు.
▪️ ట్రేడ్ టెస్ట్ అనేది అర్హత పరీక్ష మాత్రమే. దీంట్లో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
▪️రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా.. ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.
▪️ ముఖ్యంగా నిర్ణీత వ్యవధిలోగా అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయడం సాధన చేయాలి.
👉పరీక్ష కేంద్రాలు: రీజియన్లవారీగా విభజించారు.
▪️ఎస్ఆర్-1 రీజియన్ కిందికి.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు రాత పరీక్షకు దరఖాస్తులో ఎస్ఆర్-1 రీజియన్ను ఎంపిక చేసుకోవాలి.
▪️కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకే రోజున, ఒకే సెషన్లో జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఒక్క రీజియన్ కు మాత్రమే దరఖాస్తు చేయాలి.
👉రాత పరీక్షను జనవరి-2024లో నిర్వహించవచ్చు.
👉దరఖాస్తుకు చివరి తేదీ: 12.12.2023
👉Website : http://www.powergrid.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: