👉Lecturer Jobs: జిల్లా విద్య శిక్షణ సంస్థ డైట్ బోయపాలెంలో రెండు లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ఎం సుభాని శనివారం తెలిపారు.
👉గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి పి.శైలజ ఆదేశాల ప్రకారం... ఫిజికల్ సైన్స్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులు బోధించేందుకు డెప్యూటేషన్ విధానంపై పనిచేయుటకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
👉ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు.. ఎమ్మెస్సీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ)లో కనీసం 55శాతం మార్కులు, ఎంఈడీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత, అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్కు.. ఎమ్మెస్సీ కంప్యూటర్స్ లేదా ఎంసీఏలో 55శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
👉 పంచాయతీరాజ్, ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లలో పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలన్నారు.
👉 హైస్కూల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జోన్-3లో పనిచేసే ఉపాధ్యాయులు ఇందుకు అర్హులుగా పేర్కొన్నారు.
👉 నియామకం అయిన వారు కనీసం 1-3 ఏళ్ల మధ్య కాలం పనిచేయాల్సి ఉంటుందని వివరించారు. 2023 జూలై ఒకటి నాటికి దరఖాస్తుదారుని వయస్సు 58 ఏళ్లకు మించరాదన్నారు.
👉 జీతభత్యాలు డైట్ ద్వారానే ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు నవంబర్ 14 నుంచి 19వ తేదీలోగా డైట్ కళాశాలలో తమ దరఖాస్తుల్ని సమర్పించుకోవాలన్నారు.
👉 మరిన్ని వివరాలకు సెల్ నంబరు 9052343447కు సంప్రదించాలని కోరారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: