Type Here to Get Search Results !

PGCIL: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ...


👉Power Grid Corporation of India Recruitment:

👉ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. పవర్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) 184 ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

👉మొత్తం పోస్టులు - 184

👉పోస్టులు - ఖాళీలు:
1.ఇంజినీర్ ట్రైనీ (ఎలక్ట్రికల్) - 144 పోస్టులు

2.ఇంజినీర్ ట్రైనీ (సివిల్) - 28 పోస్టులు

3.ఇంజినీర్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్) - 06 పోస్టులు

4.ఇంజినీర్ ట్రైనీ (కంప్యూటర్ సైన్స్) - 06 పోస్టులు

👉అర్హతలు: అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి, ఎలక్ట్రికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్ విభాగాల్లో మినిమం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. అలాగే కచ్చితంగా GATE 2023 వ్యాలీడ్ స్కోర్ కూడా కలిగి ఉండాలి.

👉వయస్సు: అభ్యర్థుల వయస్సు 2023 నవంబర్ 10 నాటికి గరిష్ఠంగా 28 ఏళ్లులోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి నుంచి మినహాయింపులు లభిస్తాయి.

👉దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్లకు దరఖాస్తు రుసుము నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: గేట్ 2023లో వచ్చిన మార్కులకు - 85 శాతం; గ్రూప్ డిస్కషన్ కు - 3 శాతం; పర్సనల్ ఇంటర్య్వూకు 12 శాతం వెయిటేజీ ఇస్తారు. గేట్ మార్కులతోపాటు.. అభ్యర్థులకు బిహేవియరల్ అసెస్మెంట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి.. వీటిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

NOTE : ఇంటర్వ్యూ హిందీ/ఇంగ్లీష్ మాధ్యమాల్లో నిర్వహించడం జరుగుతుంది.

👉శాలరీ: ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు ఉంటుంది.

👉దరఖాస్తుకు చివరితేదీ : నవంబర్ 10, 2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments