Type Here to Get Search Results !

Coal India Limited లో మేనేజ్మెంట్ ట్రెయినీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Coal India Limited Recruitment Notification 2023:

👉మొత్తం ఖాళీలు : 560
 ◾మైనింగ్ ఇంజనీరింగ్-351
◾ సివిల్ ఇంజనీరింగ్-172
◾ జియాలజీ-37

👉అర్హతలు:
▪️మైనింగ్ ఇంజనీరింగ్: కనీసం 60 శాతం మార్కులతో మైనింగ్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
▪️ సివిల్ ఇంజనీరింగ్: కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
▪️ జియాలజీ: జియాలజీలో ఎమ్మెస్సీ/ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. లేదా అప్లయిడ్ జియాలజీ/జియోఫిజిక్స్ లేదా 60 శాతం మార్కులతో అప్లయిడ్ జియోఫిజిక్స్ విద్యార్హత ఉండాలి.

👉వయసు: 31.08.2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
▪️ కోల్ ఇండియా నిబంధనల ప్రకారం-వయోపరిమతిలో సడలింపు లభిస్తుంది.

👉శాలరీ: ఎంపికైన అభ్యర్థులు ఇ-2 గ్రేడ్ లో మేనేజ్మెంట్ ట్రైనీగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరికి ఇ-2 గ్రేడ్ కు అందించే పే స్కేల్ ప్రకారం - రూ.50,000 నుంచి 1,60,000 వేతనంగా చెల్లిస్తారు.

👉ఎంపిక విధానం : గేట్-2023 స్కోర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉పోస్టింగ్ : ఎంపికైన అభ్యర్థులు దేశంలోని కోల్ఫిల్డ్ ప్రాంతాల్లో ఎక్కడైనా విధులు నిర్వర్తించేందుకు సిద్దంగా ఉండాలి. మేనేజ్మెంట్ నిర్ణయం ప్రకారం- ఖాళీల లభ్యతను బట్టి మూడు పోస్టింగ్ చాయిస్ అప్షన్ కూడా ఇస్తారు. అభ్యర్థులు ఈ మూడింటిలో తమ ఎంపికను తెలియజేయాల్సి ఉంటుంది.

👉సర్వీస్ బాండ్ : ఎంపికైన అభ్యర్థులు 60 నెలల పాటు సంస్థలోనే పనిచేస్తామనే హామీతో సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. రూ. 3లక్షల విలువైన ఈ బాండ్ జాయినింగ్ సమయం నుంచి అమలులోకి వస్తుంది. ఇందుకోసం అభ్యర్థుల వేతనం నుంచి ప్రతి నెల రూ.5000 తీసుకుంటారు. 60 నెలల సమయం పూర్తైన తర్వాత వడ్డీ లేకుండా సంబంధిత మొత్తాన్ని చెల్లిస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: 12.10.2023

👉వెబ్సైట్https://www.coalindia.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments