Type Here to Get Search Results !

పోస్టల్ డివిజన్ పరిధిలో తపాలా జీవిత బీమా లో ఉపాధి అవకాశం.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉అనకాపల్లి పోస్టల్ డివిజన్ పరిధిలో తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలు చేయించేందుకు కొత్తగా ఏజెంట్ల నియామకం కోసం సోమవారం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు డివిజన్ అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ పాండా తెలిపారు.

👉ఇంటర్మీడియెట్ కనీస విద్యార్హత కలిగి 18 నుంచి 65 ఏళ్ల లోపు వయసు ఉన్న నిరుద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, పూర్వ బీమా ఏజెంట్లు(ఏదైనా బీమా సంస్థలో పనిచేసిన వారు), విశ్రాంత ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు, మాజీ సైనికోద్యోగులు, ఆసక్తి కలిగిన వారెవరైనా బీమా ఏజెంట్లుగా చేరడానికి అర్హులని తెలిపారు.

👉ఆసక్తిగల వారు పూర్తి చేసిన దరఖాస్తు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటాతో సోమవారం నుంచి అనకాపల్లి పోస్టల్ డివిజన్ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.

👉 ఎంపికైన అభ్యర్థులు లైసెన్సు ఫీజుగా రూ.250 చెల్లించాలి. ఎంపికైన వారిని ప్రాథమికంగా 12 నెలల కాలపరిమితికి బీమా ఏజెంట్గా నియమిస్తూ ఐడీ కార్డు, ఏజెంట్ కోడ్తో లైసెన్సు జారీ చేస్తారు.

👉 అలాగే కొత్తగా నియమితులైన ఏజెంట్లకు మూడు రోజుల శిక్షణ ఇస్తారు. నియమించబడిన అభ్యర్థులు రూ.5 వేల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.

👉 ఆ డబ్బుకు సరిపడా ఎన్ఎస్సీ బాండును ఏజెంట్ పేరున జారీ చేస్తామని సంజయ్ కుమార్ పాండా చెప్పారు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments