Type Here to Get Search Results !

TSPSC JL Exams: ఈ నెల 12 నుంచి జూనియర్ లెక్చరర్స్ పరీక్షలు.. పరీక్ష తేదీలు వాటి పూర్తి వివరాలు...


👉ఇటీవల టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ (JL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) వెల్లడించిన విషయం తెలిసిందే.

👉ఈ నోటిఫికేషన్ ద్వారా 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉ఈ నెల 12వ తేదీ నుంచి అక్టోబర్ 03 వరకు నిర్వహించనున్నారు.

👉 ఈ పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో ఉంటాయి.

👉మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు జరగనున్నాయి.

👉ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్ష తేదీలను ఇప్పటికే విడుదల చేసింది

👉 ఏ రోజు ఏ పరీక్ష నిర్వహించనుందో ఆ షెడ్యూల్ కూడా ప్రకటించింది. దాని గురించి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

👉 27 సబ్జెక్టుల్లో..
▪️మల్టీ జోన్ 1 లో 724
▪️ మల్టీ జోన్ 2 లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు...

1. ఇంగ్లిష్ - సెప్టెంబర్ 12

2. వృక్షశాస్త్రం, ఆర్థికశాస్త్రం - సెప్టెంబర్ 13

3. గణితం - సెప్టెంబర్ 14

4. రసాయనశాస్త్రం - సెప్టెంబర్ 20

5. తెలుగు - సెప్టెంబర్ 21

6. భౌతికశాస్త్రం, జంతుశాస్త్రం - సెప్టెంబర్ 22

7. కామర్స్ - సెప్టెంబర్ 25

8. సివిక్స్, అరబిక్, ఫ్రెంచ్ - సెప్టెంబర్ 26

9. హిందీ - సెప్టెంబర్ 27

10. చరిత్ర, సంస్కృతం - సెప్టెంబర్ 29

11. ఉర్దూ - అక్టోబర్ 3

👉పరీక్షవిధానం
▪️మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
▪️ పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు),
▪️పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి.
▪️ పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు.
▪️పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో ఉంటుంది.
▪️పేపర్-2 ఇంగ్లిష్ లో మాత్రమే ఉంటుంది. అయితే పేపర్ 2ని కూడా తెలుగు మీడియంలో నిర్వహించాలని తెలుగు మీడియంలో చదువుకున్న అభ్యర్థులకు కోరుతున్నారు.

👉సబ్జెక్టుల వారీగా ఖాళీలు:
1. అరబిక్ పోస్టులు: 2

2. బోటనీ - 113

3. బోటనీ (ఉర్దూ మీడియం)-15

4.కెమిస్ట్రీ - 113

5. కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం) - 19

6. సివిక్స్ - 56

7.సివిక్స్ (ఉర్దూ మీడియం) - 16

8. సివిక్స్ (మారాఠీ) - 01

9. కామర్స్ - 50

10. కామర్స్ (ఉర్దూ మీడియం) -07

11. ఎకనామిక్స్ - 81

12. ఎకనామిక్స్ (ఉర్దూ) - 15

13. ఇంగ్లీష్ - 81

14.305-02

15. హిందీ - 117

16. హిస్టరీ - 77

17. హిస్టరీ (ఉర్దూ మీడియం) - 17

18. హిస్టరీ (మరీఠీ మీడియం) -01

19. మ్యాథ్స్ - 154

20. మ్యాథ్స్ (ఉర్దూ మీడియం) - 09

21. ఫిజిక్స్ - 112

22. ఫిజిక్స్(ఉర్దూ మీడియం) - 18

23. సాంస్క్రీట్(Sanskrit) 10

24. తెలుగు - 60

25. ఉర్దూ 28

26. జువాలజీ - 128

27. జువాలజీ (ఉర్దూ మీడియం) - 18

👉ఖాళీల్లో అత్యధికంగా..
▪️ మ్యాథ్స్- 154
▪️ ఇంగ్లిష్-153
▪️ జువాలజీ-128
▪️ హిందీ-117
▪️ బోటనీ, కెమిస్ట్రీ-113 పోస్టులు
▪️ఫిజక్స్-112 పోస్టులు ఉన్నాయి.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:




Tags

Post a Comment

0 Comments