Type Here to Get Search Results !

SVPNPA Jobs: పోలీస్ అకాడమీలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు..డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ ప్రొజెక్షన్ లిస్ట్ పోస్టుల భర్తీ...


👉హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) జారీ చేసింది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి..ఎలా దరఖాస్తు చేసుకోవాలి...

👉ఖాళీలు - అర్హతలు : నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 03 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

👉 వీటిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అండ్.. జూనియర్ ప్రొజెక్షనిస్ట్ పోస్టులు ఉన్నాయి.
▪️ వీటిని పూర్తిగా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు.
▪️ మార్చి 31, 2024 వరకు పని చేయాల్సి ఉంటుంది.

👉1. డేటా ఎంట్రీ ఆపరేటర్:
▪️ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా 12వ తరగతి పాసై ఉండాలి.
▪️ దీంతో పాటు.. నిమిషానికి 40 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉండాలి.
▪️ ఎంఎస్ ఆఫీస్ పై నాలెడ్జ్ ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
▪️ఎక్కువ విద్యార్హత అర్హత కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
▪️అభ్యర్థుల యొక్క వయోపరిమితి 64 ఏళ్ల లోపు ఉండాలని తెలిపారు.
 మొత్తం ఈ కేటగిరీలో 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
▪️ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.48,207 చెల్లిస్తారు.

👉2. జూనియర్ ప్రొజెక్షనిస్ట్:
▪️ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పని సరిగా 12వ తరగతి పాసై ఉండాలి.
▪️ లేదా పదో తరగతి తర్వాత ఐటీఐ పూర్తి చేసి ఉండాలని తెలిపారు. వీటితో పాటు..
▪️కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎల్సీడీ, సినిమ ప్రొజెక్టర్ కు సంబంధించి ఆపరేట్ చేసే అనుభవం ఉండాలన్నారు.
▪️ అభ్యర్థుల యొక్క వయోపరిమితి 64 ఏళ్లుగా తెలిపారు.
▪️ మొత్తం ఈ కేటగిరీలో 01 పోస్టును భర్తీ చేయనున్నారు.
▪️ ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.35వేలకు పైగా చెల్లించనున్నారు.

👉దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : విద్యార్హతకు సంబంధించి పత్రాలను జత చేసి.. అక్టోబర్ 11, 2023లోపు "అసిస్టెంట్ డైరెక్టర్ (Estt.I), SVP National
Police Academy, Shivarampalli, Hyderabad -500052(Telangana) అడ్రస్ కు పంపించాలి.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments