Type Here to Get Search Results !

10 th,ఇంటర్,డిగ్రీ,ఐటిఐ,డిప్లొమా అర్హత కల వారికి ఉచిత శిక్షణతో ఉద్యోగఅవకాశాలు..పూర్తి వివరాలు...


👉ఉచిత శిక్షణతో ఉద్యోగ అవకాశాలు...

👉ఉపాధి హామీ పథకంలో వేతనదారుల పిల్లలకు ఉన్నతి ప్రాజెక్టు ద్వారా పలు రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఉపాధి హామీ పథకం ఏపీడీ జె.గిరిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

👉రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2018-2023 ఆర్థిక సంవత్సరాల్లో 100 రోజుల పని దినాలు పూర్తి చేసిన వేతనదారుల కుటుంబాల పిల్లలకు ఉన్నతి కార్యక్రమం ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు..

👉 ఈనెల 4న పాడేరు లో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.

👉మూడు నెలల పాటు కంప్యూటర్, మెకానిక్, ప్లంబింగ్, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఫార్మా తదితర కోర్సులపై శిక్షణ ఇస్తామన్నారు.

👉శిక్షణ పొందేందుకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ డిప్లొమో, బీటెక్ అర్హత కలిగి ఉండాలన్నారు.

👉 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులని, శిక్షణ కాలంలో ప్రతి అభ్యర్థికి రోజుకు రూ.272లు అందజేస్తామన్నారు.

👉జి.మాడుగుల, పాడేరు, హుకుంపేటకు చెందిన అసక్తి గల అభ్యర్థులు ఈనెల 4న పాడేరు వెలుగు కార్యాలయంలో, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలకు చెందిన వారు 6న పెదబయలు వెలుగు కార్యాలయంలో, డుంబ్రిగూడ, అరకు, అనంతగిరి మండలాలకు చెందిన అభ్యర్థులు 8న అరకు వెలుగు కార్యాలయంలో, చింతపల్లి, జీకే వీది, కొయ్యూరు మండలాలకు చెందిన అభ్యర్థులు ఈనెల 11న చింతపల్లి వెలుగు కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఉపాధి హామీ పథకం కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు.

👉ఉపాధి హమీ వేతనదారుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు...

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments