Type Here to Get Search Results !

KGBV ల్లో ఉద్యోగాల భర్తీ...జులై 05 వరకే దరఖాస్తులకు అవకాశం... రాత పరీక్ష మరియు పూర్తి వివరాలు...


👉పోస్టుల వివరాలు: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(KGBV)ల్లో.. స్పెషల్ ఆఫీసర్స్(ఎస్వో), పోస్టు గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్(పీజీ సీఆర్టీ), కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్(సీఆర్టీ), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (పీఈటీ) పోస్టులు; అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్(యూఆర్ఎస్)..స్పెషల్ ఆఫీసర్స్(ఎస్వో), కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్(సీఆర్టీ) పోస్టులు భర్తీ చేయనున్నారు.

👉మొత్తం పోస్టుల సంఖ్య: 1241
◾️కేజీవీబీ-పోస్టులు 1218:
◾️స్పెషల్ ఆఫీసర్-38
◾️ పీజీ సీఆర్డీ(ఇంగ్లిష్)-110
◾️పీజీసీఆర్(మ్యాథమేటిక్స్) - 60
◾️పీజీ సీఆర్డీ(నర్సింగ్)-160
◾️పీజీ సీఆర్డీ(తెలుగు)-104
◾️ పీజీ సీఆర్(ఉర్దూ)-2
◾️పీజీ సీఆర్డీ (బోటనీ) - 55
◾️పీజీ సీఆర్(కెమిస్ట్రీ)-69
◾️పీజీ సీఆర్డి(సివిక్స్)-55
◾️పీజీ సీఆర్(కామర్స్)-70
◾️పీజీ సీఆర్టీ(ఎకనామిక్స్)-54
◾️ పీజీ సీఆర్డీ(ఫిజిక్స్)-56
◾️ పీజీ సీఆర్డీ(జువాలజీ)-54
◾️సీఆర్డీ(బయో సైన్స్)-25
◾️ సీఆర్(ఇంగ్లిష్)-52
◾️సీఆర్డీ(హిందీ)-37
◾️సీఆర్డీ (మ్యాథమెటిక్స్)-45
◾️సీఆర్టీ (ఫిజికల్సైన్స్)-42
◾️ సీఆర్డీ(సోషల్ స్టడీస్)-26
◾️సీఆర్డీ(తెలుగు)-27
◾️ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ -77

👉యూఆర్ఎస్-మొత్తం పోస్టులు-23:
◾️స్పెషల్ఆఫీసర్-4
◾️సీఆర్(తెలుగు)-5
◾️సీఆర్డీ(ఇంగ్లిష్)- 5
◾️సీఆర్(సైన్స్)-6
◾️సీఆర్(సోషల్ స్టడీస్)-3

👉విద్యార్హతలు:
◾️ పీజీసీఆర్డీ: 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ తోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి.
◾️స్పెషల్ ఆఫీసర్: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్తోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ టెట్)/ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (2014.06.02 కంటే ముందు నిర్వహించిన ఏపీ టెట్)/సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) పేపర్ 2లో ఉత్తీర్ణత సాధించాలి.

👉సీఆర్డీ: 50 శాతం మార్కులతో సంబంధిత
సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్తోపాటు బీఈడీ పూర్తి చేయాలి. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ టెట్)/ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (2014.06.02 కంటే ముందు నిర్వహించిన ఏపీ టెట్)/సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పేపర్ 2లో ఉత్తీర్ణతఉండాలి.

◾️పీఈటీ: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్తోపాటు ఫిజికల్ ఎడ్యుకేషన్లో సర్టిఫికెట్/డిప్లొమా ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీతోపాటు కనీసం ఏడాది వ్యవధి ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ)లో ఉత్తీర్ణత సాధించాలి. కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్, సీఆర్, పీఈటీ, పీజీసీఆర్డీ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు దివ్యాంగులు అనర్హులు.

👉వయస్సు : 2023 జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

👉రాత పరీక్ష విధానం :
◾️ పీజీసీఆర్: మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు. జనరల్ స్టడీస్, బేసిక్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లిష్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సబ్జెక్టు కంటెంట్, పెడగాజీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

◾️స్పెషల్ ఆఫీసర్: మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, బేసిక్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లిష్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ, చైల్డ్ డెవలప్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

◾️ సీఆర్డీ: ఇందులో కూడా మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు. జనరల్ స్టడీస్, బేసిక్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లిష్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సబ్జెక్టు కంటెంట్, పెడగాజీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

◾️పీఈటీ: మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు. జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లిష్తోపాటు ఫిజియాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, శిక్షణ తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.

👉దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:
రాత పరీక్షలో అర్హులైన అభ్యర్థుల ప్రతిభ, టెట్ స్కోరు, అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అన్ని పోస్టులకు రాత పరీక్షలో అర్హత సాధించాలంటే.. ఓసీ అభ్యర్థులు 40 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు 35 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి. పీఈటీ పోస్టులకు రాతపరీక్షలో మార్కుల (100 శాతం వెయిటేజీ) ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తులకు చివరితేది: జూలై 5, 2023

👉రాత పరీక్ష తేది: జూలై 2023

👉website:

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం మీ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Linkhttps://t.me/+WOlyYT7KikdlOGRl




Tags

Post a Comment

0 Comments