Type Here to Get Search Results !

Indian Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Indian Coast Guard Recruitment Notification 2023:

👉భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) వివిధ ఖాళీలను భర్తీ చేస్తోంది. 

👉రెస్క్యూ ఆపరేషన్స్, సముద్ర సరిహద్దు భద్రత, సముద్ర కాలుష్యాన్ని నిరోధించడం వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తుంది.

👉 ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రస్తుతం సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ (OG), మోటర్ ట్రాన్స్పోర్ట్ ఫిట్టర్ (మెకానికల్), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మోటార్ ట్రాన్స్పోర్ట్ క్లీనర్) సహా వివిధ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నిర్వహిస్తోంది.

👉ఖాళీలు

👉సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ (OG): 01  
▪️OBC కేటగిరీకి చెందిన అభ్యర్థులకు అప్లై చేసుకోవచ్చు.

👉మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫిట్టర్ (మెకానికల్): 02
▪️ (UR) కేటగిరీలోని అభ్యర్థులకు కేటాయించారు.

👉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మోటార్ ట్రాన్స్పోర్ట్ క్లీనర్): 02   
▪️ అన్రిజర్వ్డ్ (UR) కేటగిరీ అభ్యర్థులకు
▪️ మరొకటి SC వర్గానికి చెందిన అభ్యర్థులకు రిజర్వ్ చేశారు.

👉మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (మాలి): 01
▪️ SC వర్గానికి చెందిన అభ్యర్థులకు రిజర్వ్ చేశారు.

👉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ప్యూన్): 02
 ▪️ ఒకటి ఆర్థికంగా వెనుకబడిన విభాగం (EWS) కేటగిరీ అభ్యర్థులకు రిజర్వ్ చేశారు.
▪️ మరొకటి SC వర్గానికి చెందిన అభ్యర్థులకు రిజర్వ్ అయింది.

👉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (స్వీపర్): 02
 ▪️ ఒకటి అన్రెజర్వ్ (UR) కేటగిరీలో ఉంది.
▪️ మరొకటి OBC వర్గానికి చెందిన అభ్యర్థులకు కేటాయించారు.

👉సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ (OG) :  మోటారు మెకానిజమ్లపై అవగాహన ఉండాలి. వివిధ వాహనాలను నడపగల సామర్థ్యం అవసరం.

👉మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫిట్టర్ (మెకానికల్) ఈ పోస్ట్ కి తప్పనిసరిగా వాహనాలను మెయింటైన్ చేయడంలో, పెట్రోల్, డీజిల్ ఇంజిన్లను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం ఉండాలి.

 👉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మోటార్ ట్రాన్స్పోర్ట్ క్లీనర్) అభ్యర్థులు గదులు, ఫర్నిచర్, భవనాలు శుభ్రపరచడం, జనరల్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా మోటారు వాహనాలకు సంబంధించిన బాధ్యతలు చూస్తారు.

👉దరఖాస్తువిధానం : ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉సెలక్షన్ ప్రాసెస్:
▪️అప్లికేషన్లను షార్ట్ లిస్ట్ చేసి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.
▪️షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారు.
▪️వారి స్కోర్ల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ను రూపొందిస్తారు.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం క్రింద టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments