Type Here to Get Search Results !

Big Update: AP High court: జిల్లా కోర్టుల్లో 3,546 ఉద్యోగాల రెండో జాబితా విడుదల...


👉అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కోర్టుల్లో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ పోస్టులకు ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు.

👉గతేడాది ఏపీలోని జిల్లా కోర్టుల్లో 3,546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

👉జిల్లా న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలు మార్చిలో విడుదల చేయగా.. మొదటి జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే విధుల్లో చేరారు.

👉 అయితే, మిగిలిన ఖాళీల భర్తీ నేపథ్యంలో తాజాగా రెండో ఎంపిక జాబితాను ప్రకటించారు. వివిధ విభాగాల్లోని ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జులై 17 నుంచి 31 వరకు జరుగుతుందని ఏపీ హైకోర్టు అధికారిక ప్రకటనలో తెలిపింది.

👉 ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేస్తారు.

👉పోస్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాల కోసం ఈ కింద లింక్లపై క్లిక్ చేయండి.


▪️ జూనియర్ అసిస్టెంట్
▪️ఫీల్డ్ అసిస్టెంట్
▪️ఎగ్జామినర్
▪️ రికార్డ్ అసిస్టెంట్
▪️ప్రాసెస్ సర్వర్
▪️ఆఫీస్ సబార్డినేట్
▪️స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -3
▪️డ్రైవర్

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

Tags

Post a Comment

0 Comments