Type Here to Get Search Results !

10వ తరగతి అర్హతతో ఎలక్ట్రిషియన్ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు...


👉10వ తరగతి అర్హతతో ఎలక్ట్రిషియన్ కోర్సులో ఉచిత శిక్షణ అందించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

👉తుమ్మపాల: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (నేక్) ద్వారా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు అసోసియేట్ ఎలక్ట్రిషియన్ కోర్సులో ఉచిత శిక్షణ, ఉపాధి కల్పించనున్నట్టు నేక్ సహాయ సంచాలకులు ఎస్.వి.ఎస్.ఎస్.రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

👉 పదవ తరగతి పాసై 15 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సు గల నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని, మాకవరపాలెంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

👉 రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహించే శిక్షణలో స్టేషనరీ ఉచితంగా ఇస్తామని తెలిపారు.

👉 శిక్షణ అనంతరం సంబంధిత రంగంలో ఉపాధి కల్పించనున్నట్టు పేర్కొన్నారు.

👉శిక్షణకు ఎటువంటి ఫీజు లేదని, ఆసక్తి గల అభ్యర్థులు 7780275922, 9394885164 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

👉 మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇన్ఫర్మేషన్ తెలియపరచడం జరుగుతుంది.



Tags

Post a Comment

0 Comments