👉విదేశాల్లో నర్సింగ్ కు ఎక్కడాలేని డిమాండ్ ఉంది.
👉అందుకే పలు కంపెనీలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ రిక్రూట్ మెంట్ చేసుకుంటున్నాయి.
👉ఈ నేపథ్యంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) జూన్ 12 నుండి 16 వరకు విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం నర్సులకు ఎన్రోల్మెంట్ డ్రైవ్లను నిర్వహించనుంది.
👉యూరప్ వంటి దేశాలలో నర్సులు, ఆరోగ్య సంరక్షణ కార్మికుల కోసం డిమాండ్ ఉంది.
👉అందువల్ల, TOMCOM ఈ దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ నమోదిత ఏజెన్సీలతో భాగస్వామ్యమై క్యాంపస్ ప్లేస్ మెంట్ మాదిరిగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తునాయి.
👉శిక్షణ, భాషా నైపుణ్యాలను అందిస్తూ అర్హత కలిగిన అభ్యర్థులకు విదేశీ ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది.
👉జూన్ 12,2023 న హైదరాబాద్లోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
👉అదే విధంగా జూన్ 14,2023 న జగిత్యాలలోని ధరూర్ క్యాంపులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో డ్రైవ్ నిర్వహిస్తారు.
👉అంతేకాకుండా రాజన్న సిరిసిల్లలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల శాంతి నగర్ లో జూన్ 15,2023.
👉జూన్ 16,2023 న చల్మెడ ఆనంద్ రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బొమ్మకల్, కరీంనగర్ లాంటి ఏరియాల్లో డ్రైవ్ ఉంటుంది.
👉 అప్డేట్ చేసిన రెజ్యూమ్ లు మరియు సంబంధిత డాక్యుమెంట్లతో పాటు అర్హత గల అభ్యర్థులు డ్రైవ్ కు హాజరు కావాల్సి ఉంటుంది.
👉 ఆసక్తి గలవారు 6302292450 లేదా 7893566493 కు కాల్ చేయవచ్చు.