Type Here to Get Search Results !

SBI లో 1,031 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...వీరికి మాత్రమే ఈ ఉద్యోగాలు...

👉 ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

👉విశ్రాంత బ్యాంకు సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన నియమించుకొనేందుకు ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.

👉 వెయ్యికి పైగా ఉద్యోగ నియామకాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

👉గతంలో బ్యాంకుల్లో పనిచేసిన అనుభవం కలిగి, ఆసక్తి కలిగినవారు SBI అధికారిక వెబ్సైట్https://sbi.co.in/ ను సందర్శించి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 SBI విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల వయసు ఏప్రిల్ 1, 2023 నాటికి కనీసం 60 ఏళ్లు; గరిష్ఠంగా 63 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.

👉రిజర్వేషన్లకు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు కల్పిస్తారు. దేశంలో కేటాయించిన చోట ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

👉 విద్యార్హత వివరాలను స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ.. ఏటీఎం ఆపరేషన్స్ లో పనిచేసిన అనుభవం కలిగినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పేర్కొంది.

👉మొత్తం 1,031 పోస్టులు ఉండగా.. ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్, ఛానల్ మేనేజర్ సూపర్వైజర్, సపోర్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.


👉 దరఖాస్తులను షార్ట్చే లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

👉ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి పోస్టింగ్ ఇస్తారు.

👉 శాలరీ:

💥ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్- నెలకు 36,000

💥ఛానెల్ మేనేజర్ సూపర్వైజర్- నెలకు 41,000

💥సపోర్ట్ ఆఫీసర్- నెలకు - 41,000
Tags

Post a Comment

0 Comments