👉ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Ecil)పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
👉హైదరాబాద్ లోని సంస్థలో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
👉భారత ప్రభుత్వ రంగ సంస్థ అయితే ఈసీఐఎల్ ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూల ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉 అర్హత:
💥ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఎంపీసీ, డిప్లొమాచేసి ఉండాలి.
💥సంబంధిత విభాగంలో కనీసం ఏడాది పాటు పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
👉 ఖాళీలు :
💥నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 29 ఖాళీలు ఉన్నాయి.
👉 పోస్టుల వివరాలు:
💥 వీటిలో టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. ఈసీఈ, ఈటీసీ, ఎలక్ట్రానిక్స్, సీఎస్ఈ, ఐటీ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
👉 దరఖాస్తు విధానం:
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
💥రాత పరీక్షలేకుండా డైరెక్టుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.
👉 శాలరీ:
💥 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ. 25వేలు
💥అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు నెలకు రూ. 24,500చెల్లిస్తారు.
👉ఇంటర్వ్యూకి హాజరు కావలసిన అడ్రస్ :
💥సీఎల్ డీ ఎస్, నలంద కాంప్లెక్స్, ఈసీఐఎల్, హైదరాబాద్ - 500062. నందు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
💥ఏప్రిల్ 6,7 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్య్వూలు నిర్వహిస్తారు.