Type Here to Get Search Results !

CRPF లో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉డైరెక్టరేట్ జనరల్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
గ్రూప్ బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్,
కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో ఎస్సై, ఏఎస్సై
ఉద్యోగాల నియామకాలకు సంబంధించి
నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

👉అర్హత: పోస్టుల్ని అనుసరించి డిగ్రీ, బీఈ, బీ.టెక్, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

👉 మొత్తం ఖాళీలు: 212 పోస్టులు

👉 పోస్టుల వివరాలు:
1. సబ్-ఇన్స్పెక్టర్(ఆర్వో): 19 పోస్టులు

2. సబ్-ఇన్స్పెక్టర్ (క్రిప్టో): 7 పోస్టులు

3. సబ్-ఇన్స్పెక్టర్ (టెక్నికల్): 5 పోస్టులు

4. సబ్-ఇన్స్పెక్టర్(సివిల్) (మేల్): 20పోస్టులు

5. అసిస్టెంట్ సబ్- ఇన్స్పెక్టర్ (టెక్నికల్): 146 పోస్టులు

6. అసిస్టెంట్ సబ్- ఇన్స్పెక్టర్(డ్రాఫ్ట్స్ మ్యాన్): 15
పోస్టులు

👉వయస్సు: 
పోస్టును అనుసరించి 21.5.2023 నాటికి ఎస్సై పోస్టులకు 30 ఏళ్లలోపు; ఏఎస్సై పోస్టులకు 18-25 ఏళ్లలోపు ఉండాలి.
◾️ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

👉శాలరీ: పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 30,000 - 2,00,000 /- వరకు వస్తుంది.

👉దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తు ఫీజు : ఎస్సై పోస్టులకు రూ.200, ఏఎస్సై పోస్టులకు రూ.100 (ఎస్సీ/ ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).

👉 ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ / ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకి చివరి తేదీ: మే 21, 2023

👉వెబ్సైట్ అడ్రస్: www.rect.crpf.gov.in
Tags

Post a Comment

0 Comments