👉 ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉 అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత అయి ఉండాలి.
👉పోస్టుల వివరాలు:
💥 జూనియర్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉 ఖాళీలు : 200 పోస్టులు ఉన్నాయి.
👉అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ 200 పోస్టుల్లో 83 పోస్టులు అన్ రిజర్వడ్, 29 ఎస్సీ, 12 ఎస్టీ, 55 ఓబీసీ, 21 ఈడబ్ల్యూఎస్ పోస్టులు కేటాయించారు.
👉 అభ్యర్థి నిమిషానికి 40 పదాల వేగంతో ఇంగ్లీష్ టైపింగ్ మరియు నిమిషానికి 35 పదాల వేగంతో హిందీ టైపింగ్ చేయాల్సి ఉంటుంది.
👉 శాలరీ:
💥ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు వేతనం ఉంటుంది.
👉వయస్సు:
💥18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
💥 రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉 ఎంపిక విధానం:
💥కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో ఈ పరీక్ష ద్విభాషా (హిందీ/ఇంగ్లీష్) లోనిర్వహించబడుతుంది.
💥రాత పరీక్షలో అభ్యర్థుల నుంచి 150 మార్కులకు 150 ప్రశ్నలు అడుగుతారు.
💥దీనికి అభ్యర్థులకు రెండు గంటల సమయం ఇస్తారు. సీబీటీ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్యను ఖాళీల సంఖ్యకు పదిరెట్లు ఉంచి మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు.
💥టైర్ I CBTలో అర్హత సాధించిన అభ్యర్థులు స్కిల్ (టైపింగ్) పరీక్ష ఉంటుంది. ఈ టైపింగ్ టెస్ట్ హిందీ లేదా ఆంగ్ల భాషలో ఉంటుంది.
👉 దరఖాస్తు ఫీజు:
💥దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.1000/- ఫీజు చెల్లించాలి.
💥ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.600/- చెల్లించాలి.
💥 దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్ 20, 2023
👉వెబ్సైట్ అడ్రస్:
💥https://www.recruitment.nta.nic.in