👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది.
👉ఈ మేరకు ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న లెక్కలను తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
👉 ఇప్పటివరకు అందిన లెక్కల ప్రకారం.. గ్రూప్-1 పోస్టులు 140,
👉గ్రూప్-2 పోస్టులు అత్యధికంగా 1082 ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
👉మొత్తం 12 శాఖల్లో గ్రూప్-1 పోస్టులు, హెచ్ఐడీలతో పాటు మరో 10 విభాగాల్లో గ్రూప్-2 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది.
👉గ్రూప్-1 ఉద్యోగాల్లో: *డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ, సీటీఓ, ఆర్డీఓ, డీఎఫ్ఎ, మున్సిపల్ కమిషన్లు. ఎంపీడీఓ తదితర పోస్టులు ఉన్నాయి.
👉 గ్రూప్-2లో సబ్ రిజిస్టార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ట్రెజరీ తదితర పోస్టులు ఉన్నాయి.
👉ఈ మేరకు ఏపీపీఎస్సీ నుంచి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
👉 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలన్నది జగన్ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది.