Type Here to Get Search Results !

గ్రామ వాలంటీర్లకు శుభవార్త : 15,000 వరకు జీతం పెంపుదలపై AP ప్రభుత్వం కీలక ప్రకటన...

👉 AP మినిస్టర్ విశ్వరూప్ కీలక ప్రకటన చేశారు.

👉 సీఎం జగన్ త్వరలో వాలంటీర్లపై ఫోకస్ పెట్టనున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారి పాత్రే కీలకం.

👉 వాలంటీర్ల వ్యవస్థ క్షేత్ర స్థాయిలో ఎలా ఉందనే విషయంపై త్వరలో రిపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఆపై జిల్లాలవారీగా వాలంటీర్లతో నేరుగా ముఖ్యమంత్రే మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

👉 జీతం పెంపుపై కీలక ప్రకటన చేశారు మంత్రి విశ్వరూప్. రాబోయే ఎలక్షన్స్లో వైసీపీ అధికారంలోకి రాగానే..

👉 గ్రామ వాలంటీర్లకు రూ.15 వేల జీతం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్లు వివరించారు. కోనసీమ జిల్లా అల్లవరంలో.. గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లతో ఆయన మీటింగ్ నిర్వహించారు.

👉 కష్టపడి పని చేసి.. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి.. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. వేరే పార్టీ రూలింగ్లోకి వస్తే వాలంటీర్ ఉద్యోగాలు తీసివేస్తుందని చెప్పుకొచ్చారు.

👉 అర్హత ఉండి.. సంక్షేమ ఫలాలు పొందని వారు ఎవరైనా ఉంటే.. వారిని 6 నెలలకు ఒకసారి క్రాస్ వెరిఫై చేసి గుర్తించాలన్నారు.

👉 అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించేలా జగన్ సర్కార్ చిత్తశుద్ధి చాటుతోందన్నారు మినిస్టర్ విశ్వరూప్. నియోజకవర్గ పరిధిలో 1200 మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చినట్లు తెలిపారు.

👉 చెప్పినట్లుగా పెరిగిన పించన్ సొమ్మును జనవరి 2023 నుంచి ఇస్తున్నామన్నారు. పెన్షన్లు తీసివేయడమనేది తప్పుడు ప్రచారమని.. ఎవరూ నమ్మొద్దన్నారు. 2019లో 39 లక్షలు ఉన్న పెన్షన్ల సంఖ్యను ప్రజంట్ 64 లక్షలకు పెంచారన్నారు మంత్రి.
Tags

Post a Comment

0 Comments