👉 తెలంగాణలో జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో మొత్తం 1,226 పోస్టులు భర్తీ కానున్నాయి.
👉 తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ (నం.06/2023) జారీ చేసింది.
👉 మొత్తం ఖాళీలు: 1226 పోస్టులు
👉 ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం:
జనవరి 11, 2023
👉 ప్రశ్న పత్రం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) / ఓమ్మార్ పరీక్షలో 45 ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్ విభాగంలో 35, జనరల్ ఇంగ్లిష్ విభాగంలో 15 ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
👉 దరఖాస్తు రుసుం: ఓసీ / ఓబీసీ అభ్యర్థులకు రూ. 600 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400).
👉 అర్హత: ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉంటే అనర్హులు. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను పేర్కొనడంతో పాటు స్థానిక భాషలు తెలిసి ఉండాలి.
👉 వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
👉 జీత భత్యాలు: నెలకు రూ. 19,000 - రూ. 58,850 చెల్లిస్తారు.
👉 ఎంపిక ప్రక్రియ: సీబీటీ / ఓఎమ్మార్ పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 పోస్టులు: ఆఫీస్ సబార్డినేట్
👉 వెబ్సైట్ లింక్:
https://tshc.gov.in/getRecruitDetails