Type Here to Get Search Results !

NCERT Jobs: ఎన్సీఈఆర్టీలో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NCERT Recruitment Notification 2024:

👉జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (NCERT)లో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఒప్పంద ప్రాతిపదికన వివిధ కేటగిరీల్లో మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉కాంట్రాక్టు ప్రాతిపదికన మొత్తం 170 పోస్టులను భర్తీ చేస్తుండగా..

👉ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ/పీజీని విద్యార్హతగా పేర్కొన్నారు. నాలుగు నెలల కాల వ్యవధితో ఎంపిక చేసే ఈ ఉద్యోగాలకు గత అనుభవం తప్పనిసరి. ఏడాది పాటు పొడిగించే అవకాశం ఉంటుంది.

👉 అసిస్టెంట్ ఎడిటర్ ఉద్యోగాలు 60: (ఇంగ్లిష్ 25; హిందీ 25, ఉర్దూ 10) ఉన్నాయి.
👉 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేవారికి 50 ఏళ్ల వయో పరిమితి.
👉 నెలకు రూ.80వేలు చొప్పున వేతనం ఇస్తారు.
👉స్క్రీనింగ్, రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 1న;
👉 స్కిల్ టెస్ట్ ఫిబ్రవరి 3న దిల్లీలో నిర్వహిస్తారు.

👉ప్రూఫ్ రీడర్ పోస్టులు 60:
 (ఇంగ్లిష్ 25, హిందీ 25, ఉర్దూ 10) ఉండగా..
👉ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే వారికి వయో పరిమితి 42 ఏళ్లు.
👉 ప్రింటింగ్/ పబ్లిషింగ్ సంస్థలో ఏడాది పాటు పనిచేసిన అనుభవం అవసరం. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
👉నెలకు వేతనం రూ.37వేలు.
👉ఫిబ్రవరి 1న స్క్రీనింగ్, రిజిస్ట్రేషన్,
👉 ఫిబ్రవరి 2న స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

👉డీటీపీ ఆపరేటర్స్ పోస్టులు 50:(ఇంగ్లిష్ 20, హిందీ 20, ఉర్దూ 10)
 భర్తీ చేయనుండగా
👉ఈ పోస్టులకు వయో పరిమితి 45 ఏళ్లుగా నిర్ణయించారు.
👉నెలకు వేతనం రూ.50వేలు చొప్పున చెల్లిస్తారు.
👉 ఫిబ్రవరి 1న స్క్రీనింగ్, రిజిస్ట్రేషన్,
👉 ఫిబ్రవరి 2,3 తేదీల్లో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
👉ఈ ఉద్యోగాలన్నింటికీ దరఖాస్తు చేసుకొనేవారు ఇంటర్వ్యూ సమయంలో బయోడేటాతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. 

👉ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్, డీటీపీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దిల్లీలో వాకిన్లు నిర్వహించనున్నారు.

👉ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్లు/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు వయో సడలింపు ఉంటుంది.

👉Websitencert.nic.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments