👉UIIC Recruitment Notification 2023: చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల..
👉మొత్తం ఖాళీలు : 300
▪️యూఆర్ - 159 పోస్టులు
▪️ ఓబీసీ - 55 పోస్టులు
▪️ఈడబ్ల్యూఎస్ - 30 పోస్టులు
▪️ ఎస్సీ - 30 పోస్టులు
▪️ ఎస్టీ - 26 పోస్టులు
👉తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..
▪️ ఆంధ్రప్రదేశ్ లో - 08
▪️ తెలంగాణలో - 03 అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
👉అర్హతలు: అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
👉 వయస్సు: అభ్యర్థుల వయస్సు 2023 సెప్టెంబర్ 30 నాటికి 21 ఏళ్లు నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
▪️ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లులు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
👉 దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా జీఎస్టీ కూడా కట్టాల్సి ఉంటుంది.
▪️ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, కంపెనీ ఉద్యోగులు అప్లికేషన్ ఫీజుగా రూ.250 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ముందుగా ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను.. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
👉శాలరీ : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.22,405 నుంచి రూ.62,265 వరకు జీతభత్యాలు ఉంటాయి.
👉దరఖాస్తుల ప్రారంభతేది : డిసెంబర్ 16,2023
👉దరఖాస్తులకు చివరితేదీ : జనవరి 6,2024
👉Website : https://uiic.co.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: