Type Here to Get Search Results !

APPSC Notification: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 897 గ్రూప్ - 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 897 గ్రూప్ - 2 ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఇందులో ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు కలిపి 897 ఉన్నాయి.

👉రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 897 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో మొత్తం 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులతో పాటు 566 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.

👉ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో..
▪️మున్సిపల్ కమిషనర్లు
▪️ సబ్ రిజిస్టార్లు
▪️డిప్యూటీ తహసీల్దార్లు
▪️ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు
▪️ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు
▪️ పంచాయతీ రాజ్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లు
▪️ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్లు
▪️చేనేత శాఖలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులున్నాయి.

👉నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో..
▪️ రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు
▪️ సీనియర్ ఆడిటర్లు
▪️ సీనియర్ అకౌంటెంట్లు
▪️ జూనియర్ అకౌంటెంట్లు
▪️ జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగాలు ఉన్నాయి.

👉 వీటికి దరఖాస్తు చేసుకోవాలనే వారు ఏపీపీఎస్సీ వెబ్ సైట్లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదలైన ఇవాల్టి నుంచి వచ్చే ఏడాది జనవరి 10 వరకూ గడువు ఇచ్చారు.

👉గ్రూప్ - 2 పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షల వివరాలను కూడా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ లో ఇచ్చింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు.

👉 మెయిన్ పరీక్ష తేదీని ఆ తర్వాత ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ) నిర్వహిస్తారు.

👉 ఇందులోనూ అర్హత సాధించిన వారికే ఉద్యోగాలు లభిస్తాయని ఏపీపీఎస్సీ తెలిపింది.

👉స్క్రీనింగ్ టెస్టులో ఆఫ్ లైన్ మోడ్ లో ఓఎంఆర్ విధానంలో ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది.

👉మెయిన్స్ పరీక్షలోనూ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుందని, లేదా కంప్యూటర్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని, ఇందులో తుది నిర్ణయం కమిషన్ తీసుకుంటుందని తెలిపారు.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments