👉బ్యాంక్ ఎగ్జామ్స్క ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇటీవల వరుసగా బ్యాంక్ నోటిఫికేషన్స్ వెలువడుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (MSC BANK) ట్రైనీ క్లర్క్స్, ట్రైనీ జూనియర్ ఆఫీసర్ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
👉మొత్తం ఖాళీలు : 153
👉ఖాళీలు వివరాలు :
▪️మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రధానంగా ట్రైనీ జూనియర్ ఆఫీసర్స్-45 పోస్టులు
▪️ స్టెనో టైపిస్ట్ ఇన్ జూనియర్ ఆఫీసర్ గ్రేడ్- 01
▪️ ట్రైనీ క్లర్క్-107 పోస్టులను భర్తీ చేస్తుంది.
👉అర్హత : ట్రైనీ జూనియర్ ఆఫీసర్స్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థి వయసు 23 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఏదైనా ఫీల్డ్ బ్యాచిలర్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. ట్రైనీ క్లర్క్ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థి వయసు 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఏదైనా ఫీల్డ్ కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్టెనో టైపిస్ట్ పోస్టులకు అభ్యర్థి వయసు 23 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
👉ఎంపిక విధానం : అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ముందు ఆన్ లైన్ రాత పరీక్ష, తర్వాత ఇంటర్వ్యూ, చివరకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. రాత పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఎగ్జామ్లో నాలుగు సెక్షన్స్ ఉంటాయి. అభ్యర్థులు 50 శాతం స్కోర్ చేస్తే తరువాత దశకు అర్హత సాధిస్తారు.
👉దరఖాస్తు ఫీజు :
▪️ట్రైనీ జూనియర్ ఆఫీసర్స్, స్టెనో టైపిస్ట్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటే అప్లికేషన్ ఫీజు రూ. 1770/- చెల్లించాలి.
▪️ ట్రైనీ క్లర్క్ కోసం అప్లికేషన్ ఫీజు రూ.1180/-గా నిర్ణయించారు. ఫీజును కేవలం ఆన్లైన్లో మాత్రమే పేమెంట్ చేయాలి.
👉శాలరీ :
▪️ట్రైనీ జూనియర్ ఆఫీసర్స్ పోస్ట్ కు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.49,000/-
▪️ ట్రైనీ క్లర్క్ రూ.32,000/-
▪️స్టెనో టైపిస్ట్ కు రూ.50,415/- లభిస్తుంది.
👉website : www.mscbank.com
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: