👉HCL Recruitment Notification 2023:
👉 ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(HCL)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
👉 మధ్యప్రదేశ్లోని మలంజండ్ కాపర్ ప్రాజెక్టులో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
👉 ఆసక్తి గల అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత, వయసు పరిమితి, పోస్టుల వివరాలు, శిక్షణ కాలం, తదితర వివరాలను నోటిఫికేషన్లో వివరంగా పొందుపర్చింది. అవేంటో చూద్దాం.
👉 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఐటీఐ) పూర్తి చేసిన వారు అర్హులు. పదో తరగతి కూడా పాసై ఉండాలి.
👉 ఈ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారిక ప్రకటనలో పేర్కొంది. అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులకు కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ఠ వయసు 25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు ఎక్కువ పరిమితి ఉంటుంది. పోస్టుల ప్రకారం.. ఎంపికైన వారికి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది.
👉 మొత్తంగా వివిధ విభాగాల్లో కలిపి 184 ఖాళీలు ఉన్నాయి. మేట్ (మైన్స్) పోస్టుకు మూడేళ్ల పాటు శిక్షణ ఉంటుంది. బ్లాస్టర్(మైన్స్), డీజిల్ మెకానిక్లకు రెండేళ్లు; ఫిట్టర్కి, టర్నర్, వెల్డర్(గ్యాస్, ఎలక్ట్రిక్), డ్రాట్స్మెన్(మెకానికల్) పోస్టులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.
👉 ఇక, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, సర్వేయర్, ఏసీ, రిఫ్రిజిరేషన్ ఆపరేటర్, కార్పెంటర్, ప్లంబర్, హార్టికల్చర్ అసిసటెంట్, ఇన్స్ట్రూమెంట్ మెకానిక్స్కి సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది.
👉 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ:
ఆగస్టు 5, 2023
👉 ఎంపికైన అభ్యర్థుల జాబితాను సంస్థ సెప్టెంబర్ 19న విడుదల చేస్తుంది.
👉 ఎంపిక ప్రక్రియ..
▪️ఐటీఐ, పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
▪️10వ తరగతి మార్కుల నుంచి 70 శాతం, ఐటీఐ మార్కుల నుంచి 30 శాతం వెయిటేజీని పరిగణిస్తారు.
▪️ఒకవేళ ఇద్దరు, అంతకంటే ఎక్కువ మందికి సమాన మార్కులు వస్తే గరిష్ఠ వయసు కలిగిన అభ్యర్థిని ఎంపిక చేస్తారు.
▪️అయితే, HCL షరతుల మేరకు అభ్యర్థులు మెడికల్గా ఫిట్ గా ఉండాలి.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
👉 Website: hindustancopper.com
👉 అనంతరం "Establishment Search" ఆప్షన్లో ఈ పోస్టుకు సంబంధించి ఉన్న లింక్పై క్లిక్ చేయాలి.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం క్రింద టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: