Type Here to Get Search Results !

EPFO నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల...


👉 ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది

👉 అర్హతలు: ఈపోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం హిందీలో మాస్టర్స్ డిగ్రీ, దీనిలో ఇంగ్లీషు తప్పనిసరి లేదా ఎలక్టివ్ సబ్జెక్ట్ నైనా చదివి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్ మాస్టర్స్ డిగ్రీ, దీనిలో హిందీ తప్పనిసరి లేదా ఎలక్టివ్ గానైనా చదివి ఉండాలి. హిందీ మాధ్యమంలో ఇంగ్లిష్ ఓ సబ్జెట్టుగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా మాస్టర్స్ డిగ్రీ లేదా ఇంగ్లిష్ మాధ్యమంలో హిందీ ఓ తప్పనిసరి సబ్జెక్టు లేదా ఎలక్టివ్గా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.

◾️ దీంతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి హిందీ టు ఇంగ్లీషుకు అనువాదం లేదా హిందీ నుంచి ఇంగ్లీషుకు అనువాదంలో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.

👉 అనుభవం: ఏదైనా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ అండర్టేకింగ్ సంస్థలో హిందీ నుంచి ఇంగ్లీషుకు అనువాదం లేదా హిందీ నుంచి ఇంగ్లీషుకు అనువాదంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.

👉 ఈపీఎఫ్ రిక్రూట్మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్ 06లో నెలవారీ జీతం అందిస్తారు. అంటే రూ.35,400 నుంచి రూ. 1,12,400 వరకూ ఉంటుంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకొనే వారికి గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు. రెండేళ్ల కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులు భర్తీ చేస్తారు. మొత్తం 86 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇవి..

👉 పోస్టుల వివరాలు:. జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈపీఎఫ్ఎ దరఖాస్తులు కోరుతోంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 86 ఖాళీలు ఉన్నాయి.

👉 రిజర్వేషన్లు: మొత్తం పోస్టులు 86 కాగా, వీటిలో అన్ రిజర్వ్డ్ 23, ఈడబ్బ్యూఎస్ వారికి 12, ఓబసీకి 28, ఎస్సీ 14, ఎస్టీ 9, పీడబ్ల్యూబీడీ 4 ఉన్నాయి

👉 వయోపరిమితి: నోటిఫికేషన్ ముగింపు తేదీ నాటికి అభ్యర్థుల గరిష్ట వయసు 30 సంవత్సరాలకు మించకూడదు.

👉 సడలింపులు : ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు- 30 ఏళ్లు మించకూడదు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు- 35 ఏళ్లు మించకూడదు. ఇతర వెనుకబడిన తరగతులకు- 33 ఏళ్లకు మించకూడదు.

👉 జీతం : అధికారిక నోటిఫికేషన్లో ఇచ్చినట్లుగా, ఎంపికైన అభ్యర్థికి పే మ్యాట్రిక్స్ లోని లెవల్ 06లో నెలవారీ జీతం ఇస్తారు. అంటే నెలకు రూ. 35400 నుంచి రూ. 112400 వరకూ ఉంటుంది.

👉 పదవీకాలం: అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అపాయింట్మెంట్ కేవలం 2 సంవత్సరాల కాలానికఁ చెల్లుతుంది.

👉 దరఖాస్తు విధానం:. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ జూలై 13లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: July 13, 2023

👉 Website: https://www.epfindia.gov.in/site_en/index.php

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Post a Comment

0 Comments