👉BHARAT ELECTRONICS LIMITED Recruitment Notification :
👉ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పలు విభాగాల్లో ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉సీనియర్ ఇంజినీర్, డిప్యూటీ మేనేజర్స్, ట్రైనీ ఇంజినీర్, ప్రోజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) పలు విభాగాల్లో ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉సీనియర్ ఇంజినీర్, ప్రోజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్ పోస్టుల కోసం విడివిడిగా నోటిఫికేషన్స్ విడుదల చేసింది.
👉బెల్ సీనియర్ ఇంజినీర్ జాబ్స్:
▪️ నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ 'బెల్' 24 సీనియర్ ఇంజినీర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉పోస్టుల వివరాలు:
▪️డిప్యూటీ మేనేజర్ - 05
▪️సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ - 19
👉అర్హతలు : ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితోపాటు ఆయా పోస్టులకు అనుగుణంగా పూర్వ అనుభవం కూడా ఉండాలి.
👉వయస్సు : 2023 మే 01 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 36 ఏళ్ల గరిష్ఠ పరిమితి; సీనియర్ ఇంజినీర్ పోస్టులకు 32 ఏళ్ల గరిష్ఠ పరిమితి విధించారు.
👉ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీనియర్ ఇంజినీర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
▪️ఆసక్తి గల అభ్యర్థులు 2023 జులై 4లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
▪️ముఖ్యంగా ' "మేనేజర్ (హెస్ఆర్), ప్రోడక్ట్ డెవలప్మెంట్ & ఇన్నోవేషన్ సెంటర్ (పీడీఐసీ), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ప్రొఫెసర్ యూఆర్ రావ్ రోడ్, నియర్ నాగాలాండ్ సర్కిల్, జలహల్లి పోస్ట్, బెంగళూరు - 560013, ఇండియా " చిరునామాకు తమ దరఖాస్తును పంపించాల్సి ఉంటుంది.
👉బెల్ ట్రైనీ అండ్ ప్రోజెక్ట్ ఇంజినీర్ జాబ్స్ : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 82 ట్రైనీ ఇంజినీర్, ప్రోజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉పోస్టుల వివరాలు:
ట్రైనీ ఇంజినీర్ (జాబ్ కోడ్ - టీఈ0101) - 43 -
👉ప్రోజెక్ట్ ఇంజినీర్ (జాబ్ కోడ్ - పీఈ0101) - 38 ప్రోజెక్ట్ ఇంజినీర్ (జాబ్ కోడ్ - పీఈ0102) - 01
👉మొత్తంగా 82 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
👉అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా
విద్యాసంస్థ నుంచి నాలుగేళ్ల వ్యవధి గల ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ ల్లో బీఈ/బీటెక్/ బీఎస్స్ (ఇంజినీరింగ్) చేసి ఉండాలి. దీనితోపాటు ఆయా పోస్టులకు అనుగుణంగా పూర్వ అనుభవం ఉండాలి.
👉వయస్సు : ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు 2023 మే 01 నాటికి 28 ఏళ్ల గరిష్ఠ పరిమితి; ప్రోజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలకు 32 ఏళ్ల గరిష్ఠ పరిమితి ఉంది.
👉ఎంపిక విధానం:
అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటిలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తుకు చివరి తేదీ : 2023 జూన్ 28. ఆసక్తి గల అభ్యర్థులు "మేనేజర్ (హెర్ఆర్), ప్రోడక్ట్ డెవలప్మెంట్ & ఇన్నోవేషన్ సెంటర్ (పీడీఐసీ), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రొఫెసర్ యూఆర్ రావ్ రోడ్, నియర్ నాగాలాండ్ సర్కిల్, జలహల్లి పోస్ట్, బెంగళూరు - 560013, ఇండియా " చిరునామాకు తమ దరఖాస్తును పంపించాల్సి ఉంటుంది.
👉 పూర్తి వివరాలు చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనగలరు.
👉 Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl