👉అర్హత: సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న,అవివాహితులైన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
◾️ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయస్సు: జనవరి 01, 2024 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 40
◾️సివిల్-11,
◾️కంప్యూటర్ సైన్స్-09,
◾️ఎలక్ట్రికల్-04,
◾️ఎలక్ట్రానిక్స్-06,
◾️ మెకానికల్-08,
◾️మిసిలేనియస్-02
👉శిక్షణ వివరాలు: ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), డెహ్రాడూన్లో శిక్షణ ఉంటుంది.
◾️కోర్సు కాలవ్యవధి 49వారాలు.
◾️శిక్షణలో చేరినప్పటి నుంచే లెఫ్టినెంట్ హోదా ఇస్తారు.
◾️షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) నిబంధనల ప్రకారం వేతనం అందుతుంది.
◾️ ఆ సమయంలో నెలకు రూ. 56,100/-చెల్లిస్తారు. ◾️విజయవంతంగా శిక్షణ పూర్తి చేసు కున్న అభ్యర్థులు శాశ్వత కమిషన్ పరిధిలోకి వస్తారు.
👉శాలరీ : శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లో చేరిన వారికి లెవల్-10 ప్రకారం మూలవేతనం లభిస్తుంది.
◾️ఇలా ఎంపికైన వారికి ప్రతి నెల రూ.56,100/- తోపాటు మిలటరీ సర్వీస్ పే కింద రూ.15,500/- అందుతాయి.
◾️వీటితోపాటు డీఏ, హెచ్ఐర్ఎ, ప్రోత్సాహకాలు దక్కుతాయి.
◾️ఈ కొలువులో చేరిన వారు తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.
◾️ విధుల్లో చేరిన రెండేళ్ల తర్వాత కెప్టెన్, ఆరేళ్ల సర్వీస్లో మేనేజర్, పదమూడేళ్ల అనుభవంతో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలను అందుకోవచ్చు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మార్కులకు కట్ ఆఫ్ నిర్ణయిస్తారు. దాన్ని బట్టి షార్టిస్ట్ చేస్తారు.
◾️వీరికి సర్వీస్ సెలక్షన్ బోర్డు(ఎస్ఎస్ఓ).. బెంగళూరులో ఐదు రోజులపాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
◾️మొదటి రోజు స్టేజ్-1 స్క్రీనింగ్(ఇంటెలిజెన్స్) పరీక్షలు ఉంటాయి.
◾️ఇందులో అర్హత సాధించిన వారినే స్టేజ్-2కి ఎంపిక చేస్తారు.
◾️వీరికి నాలుగు రోజులపాటు పలు విభాగాల్లో పరీక్షించి, అందులో రాణించిన వారికి మెడికల్ పరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేదీ: 2023, మే 17
👉వెబ్సైట్: https://joinindianarmy.nic.in/