👉ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తాజాగా యంగ్ లీగల్ ప్రొఫెషనల్ (Young Legal Professional) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అభ్యర్థులను రిక్రూట్ చేసుకోనుంది.
👉ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మొత్తం 15 యంగ్ లీగల్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో 2 పోస్టులను హెడ్ క్వార్టర్ ఆఫీస్, న్యూఢిల్లీకి కేటాయించారు.
👉ఢిల్లీ, బెంగళూరు, భోపాల్, ముంబై, కోలకతాలోని రీజనల్ డైరెక్టరేట్ ఆఫీస్లతో పాటు ఆగ్రా, భోపాల్, భువనేశ్వర్, ఛండీగడ్, న్యూఢిల్లీ, దార్వాడ్, హంపి, వడోదరాలోని సర్కిల్ ఆఫీస్లకు ఒక్కొ పోస్ట్ కేటాయించారు.
👉వయస్సు :అభ్యర్థుల వయసు మార్చి01, 2023 నాటికి 40 ఏళ్లలోపు ఉండాలి.
👉అర్హత :గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి ఏదైనా రాష్ట్ర బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
◾️హైకోర్టు, క్యాట్, సుప్రీంకోర్టల్లో కేసులను హ్యాండిల్ చేయడంలో కనీసం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి.
◾️అలాగే కార్మిక సంబంధ సమస్యలపై కోర్టుల్లో కేసులను హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ అవసరం.
◾️వివిధ న్యాయస్థానాల్లో న్యాయపరమైన విషయాలను డీలింగ్ చేయడంలో మంచి నైపుణ్యం ఉండాలి.
◾️MS Wordతో పాటు ఇతర కంప్యూటర్ అప్లికేషన్లపై వర్క్ చేయడంలో మంచి అనుభవం అవసరం.
◾️భారతీయ చరిత్ర, పురావస్తుశాస్త్రం, ప్రాచీనతపై పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
◾️సంబంధిత రాష్ట్ర ప్రాంతీయ భాష పరిజ్ఞానం ఉండాలి. ప్రభుత్వం, స్వయంప్రతిపత్తి సంస్థలు, PSUల్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
◾️ఏన్సియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమెయిన్స్ యాక్ట్ (AMASR)-1958, యాంటిక్విటీ అండ్ ఆర్ట్ ట్రెజర్స్(AAT) యాక్ట్- 1972, కాంట్రాక్ట్ లేబర్ (రెగ్యులేషన్ అండ్ అబాలిషన్) యాక్ట్-1970లకు సంబంధించిన కేసులను డీలింగ్ చేయడంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
👉అడ్రస్: డైరెక్టర్ జనరల్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ధరోహర్ భవన్, 24, తిలక్ మార్గ్, న్యూఢిల్లీ - 110001 అనే అడ్రస్ కు పంపాలి. అప్లికేషన్ ఎన్వలప్పై 'అప్లికేషన్ ఆఫ్ యంగ్ లీగల్ ప్రొఫెషనల్' అని మెన్షన్ చేయాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 12 తేదీలోపు పంపాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
◾️ రాత పరీక్షకు హాజరయ్యేందుకు ఎలాంటి టీఏ, డీఏ వంటి సదుపాయాలు కల్పించరు.
👉శాలరీ : అభ్యర్థులకు నెలకు రూ.70,000 జీతం ఉంటుంది.