Type Here to Get Search Results !

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. పది ఉత్తీర్ణతతో 438 పోస్టులకు నోటిఫికేషన్..NO EXAM

👉 యంత్ర ఇండియా లిమిటెడ్ పరిధిలో ఆర్డినెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ- చండీగఢ్, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ - జబల్పూర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ- ఇటార్సీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ- ఖమారియా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ- కట్ని, వెహికల్ ఫ్యాక్టరీ- జబల్పూర్, హై ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ- కిర్కీ, మెషిన్ టూల్ ప్రొటోటైప్ ఫ్యాక్టరీ- అంబర్నాథ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ - అంబఝరి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్- మెదక్ తదితర సంస్థలు ఉన్నాయి.

👉 మెదక్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 దరఖాస్తుల స్వీకరణ తేదీ:
💥 ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 27 నుంచి ప్రారభం అయింది.

👉 దరఖాస్తులకు చివరి తేదీ :
💥 దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 28, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

👉 ఎంపిక విధానం:
💥 విద్యార్హతలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. వీటికి ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు.

👉  పోస్టుల వివరాలు:
💥 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. మొత్తం ఖాళీలు 5,395 పోస్టులు ఉన్నాయి. వీటితో ఐటీఐ 3508, నాన్ ఐటీఐ 1887 పోస్టులు ఉన్నాయి. ఐటీఐ ట్రేడ్ లల్లో.. మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ M/C టూల్ మెయింటెనెన్స్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ వంటివి ఉన్నాయి.

👉 ఐటీఐ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి.. సంబంధిత ట్రేడ్ ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

👉 నాన్-ఐటీఐ కేటగిరీకికి సంబంధించి అభ్యర్థులు 50 శాతం మార్కులతో పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.

👉 వయోపరిమితి :
💥 వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
💥 ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోసడలింపు ఉంటుంది.

👉 అప్లికేషన్ ఫీజు..
💥 రూ.200 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
💥 రిజర్వేషన్ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి.

👉 దరఖాస్తులను కేవలం ఆన్ లైన్ విధానంలో మాత్రమే పంపించాలి.

👉 నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి.. ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

👉 వెబ్సైట్ అడ్రస్ :
💥 https://www.yantraindia.co.in/career.php
Tags

Post a Comment

0 Comments