Type Here to Get Search Results !

రెండు ఫోన్లలో ఒకటే వాట్సప్ నెంబర్... అప్డేట్ చేసుకోండి ఇలా...

👉 ఒకే నెంబరు ఎకౌంటును రెండు ఫోన్లలో ఉపయోగించేందుకు వాట్సాప్ వీలు కల్పిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే రెండు స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ ను యాక్సెస్ చేసుకునేందుకు సౌలభ్యం కల్పిస్తోంది.

👉 చాట్ సింక్(Chat Sync) సమస్యలు లేకుండా రెండు ఫోన్ల ద్వారా వాట్సాప్ వాడొచ్చు.

👉 'వాట్సాప్ వెబ్ ఫీచర్ ద్వారా ఇలా రెండు వేర్వేరు డివైజ్లలో ఒకే వాట్సాప్ వాడుకోవచ్చు.

👉 దాదాపు ఇదే పద్ధతి ద్వారా రెండు స్మార్ట్ఫోన్లలో ఒకే వాట్సాప్ అకౌంట్ను మేనేజ్ చేయొచ్చు.

👉 రెండో ఫోన్ను ప్రైమరీ డివైజ్కు లింక్ చేయడం ద్వారా ఈ ఫీచర్ను ఉపయోగించొచ్చు.

👉 ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవ్వండి:

💥 మీరు వాడాలనుకుంటున్న రెండో ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేయండి.

💥 ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి.. ఇప్పటికే వాట్సాప్ ఉన్న (మీ ప్రైమరీ అకౌంట్) ఫోన్ నెంబర్ను ఎంటర్ చేయండి.

💥 తర్వాత మెనూ(Menu)లోకి వెళ్లడానికి కుడివైపు పైభాగంలో కార్నర్లో ఉన్న త్రీ డాట్స్ బటనైపై క్లిక్ చేయండి.

💥 ఇక్కడ డిస్ప్లే అయ్యే ఆప్షన్స్ నుంచి 'లింక్ డివైజ్ (Link device)' అనే ఆప్షను సెలెక్ట్ చేసుకోండి.

💥 ఇప్పుడు మీ మొదటి ఫోన్(ప్రైమరీ డివైజ్)లో వాట్సాప్ ఓపెన్ చేసి.. త్రీ డాట్స్ మెనూ క్లియ్ చేయండి.

💥 అక్కడ సెట్టింగ్స్ (Settings) ఓపెన్ చేయండి. ఈ లిస్ట్లో డిస్ప్లే అయ్యే ఆప్షన్స్ నుంచి 'లింక్డ్ డివైజెస్' ఆప్షన్ను ఎంచుకోండి.

💥 అనంతరం 'లింక్ ఎ డివైజ్ (Link a device)పై ట్యాప్ చేయండి. రెండో ఫోన్లో చూపిస్తున్న QR కోడ్ను మొదటి ఫోన్ ద్వారా స్కాన్ చేయండి.

💥 చాట్ సింక్ అయ్యే వరకు వేచి చూడండి. పూర్తయ్యాక మీరు రెండు డివైజ్లలో ఒకే వాట్సాప్ ఒకే సమయంలో వినియోగించొచ్చు.
Tags

Post a Comment

0 Comments