👉 పదోన్నతులపై ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు మాట్లాడుతూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ చరిత్రలో పదోన్నతి పొందిన టీచర్లకు ఇంక్రిమెంటుకు బదులు అలవెన్సులు ఇస్తామనడం ఇదే ప్రథమమని, ఇలాంటి అలవెన్సులతో కూడిన పదోన్నతులను తమ సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.
👉 పాఠశాలల విలీనం వల్ల ఉపాధ్యాయులకు పెద్ద సంఖ్యలో పదోన్నతులు కల్పిస్తామని నమ్మించి చివరకు అలవెన్సులతో సరిపుచ్చడం దారుణమన్నారు.
👉 ఉపాధ్యాయులకు నో ఇంక్రిమెంటు... నో సర్వీస్
👉 అలవెన్సు ఇస్తామనడాన్ని తప్పుబట్టిన సంఘాలు
👉 పదోన్నతులకు అర్హులైన AP ఉపాధ్యాయులకు ఇంక్రిమెంటుతో కూడిన వేతనం ఇవ్వాలని, తాత్కాలిక అలవెన్సులు ఇవ్వడం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం లేదని ఉపాధ్యాయ వర్గం అంటోంది.
👉 తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను అధిగమించడానికి గతేడాది అక్టోబరులో పదోన్నతులు కల్పించి పోస్టింగ్లు ఇవ్వని సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రస్తుతం ఎస్ఏలుగా పదోన్నతి ఇస్తూ పోస్టింగ్ ఉత్తర్వులిస్తున్నారు.
👉 'ఇంక్రిమెంటు ఇవ్వకపోతే అది పదోన్నతి కిందకే రాదు. తాత్కాలిక అలవెన్సు అనేది అతిథి, ఒప్పంద టీచర్లకు ఇచ్చే భృతి.
👉 దాని వల్ల ఉపాధ్యాయుడికి ఎలాంటి ప్రయోజనం వర్తించదు. దాన్ని ఎప్పుడైనా ప్రభుత్వం నిలుపుదల చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
👉 దీని వల్ల అంతిమంగా ఉపాధ్యాయుడికి నష్టం వస్తుందని' అంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో గతేడాది అక్టోబరులో 395 మంది ఎస్ఓటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా (సబ్జెక్టు టీచర్లు) పదోన్నతి ఇచ్చారు.
👉 మూడు నెలల నుంచి వారికి పోస్టింగులు ఇవ్వలేదు. వారు పనిచేస్తున్న పాఠశాలల్లోనే కొనసాగుతున్నారు.
👉 వీరికి శుక్రవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు పోస్టింగ్లు ఇవ్వడానికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇంగ్లీష్, గణితం, బయాలజీ సబ్జెక్టులకు చెందిన సుమారు 200 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు.
👉 వీరంతా అయిష్టంగానే పదోన్నతి పోస్టింగ్లు తీసుకున్నారు. ఇ క్రిమెంట్ ఇస్తే అది జీతంలో కలిసి తమకు నెలవారీ వచ్చే వేతనం కూడా బాగా పెరుగుతుంది.
👉 'తాత్కాలిక అలవెన్సు అనేది ఫిక్స్డ్ ఇచ్చేది. అది ఎందులోనూ కలపరు. దానివల్ల తమకు జీతంలో ఎలాంటి తేడా ఉండదని' ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
👉 మూడు నెలల క్రితమే అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి పోస్టింగ్లు ఇవ్వకుండా ఇప్పటిదాకా కాలయాపన చేసి తీరా పే ఫిక్సేషన్ చేయకుండా పోస్టింగ్లు ఇవ్వటం అన్యాయమనే అభిప్రాయం వ్యక్తమైంది.
👉 ఇలా చేయడం అంటే ఉపాధ్యాయులను మోసగించటమేనని ఆరోపిస్తున్నారు. మూడు నెలల క్రితమే తమకు పదోన్నతులతో కూడిన పోస్టింగ్ ఇచ్చి ఉంటే తమకు ఆరోజు నుంచి సర్వీస్ కలిసొచ్చేది, దీన వల్ల తమకు పదవీ విరమణ ప్రయోజనాలు కూడా బాగా పొందటానికి ఉపయోగపడేది.
👉 ప్రస్తుతం ఇచ్చే అలవెన్సుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. టీచర్లకు ఇంక్రిమెంట్లతో కూడిన పదోన్నతులు మాత్రమే ఇవ్వాలని ఉపాధ్యాయవర్గం డిమాండ్ చేస్తోంది.
👉 మరోవైపు ఈ అలవెన్సులకు ఇప్పటి వరకు ఆర్థికశాఖ నుంచి అనుమతి రాలేదు. ఇది కూడా వర్తిస్తుందో రాదో తెలియకుండా ఉంది.
👉 ప్రభుత్వం ఇచ్చిన మెమోలో ఎక్కడా ఆర్థికశాఖ అనుమతి ఉన్నట్లు లేదని ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు.