👉 గతేడాది నవంబరులో పెన్షన్ కోసం వేలి ముద్రలు వేసినా పెన్షన్దారులు తప్పనిసరిగా ఫిబ్రవరి నెలాఖరులోగా మరోసారి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.
👉 ఉద్యోగ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్ కోసం సోమవారం నుంచి ఫిబ్రవరి 28 తేదీ లోగా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాలి.
👉 వేలి ముద్ర పడకపోతే..
💥 పెన్షన్దారుల వేలిముద్రలు పడకపోతే అటువంటి వారు నేరుగా ఎస్టీవో కార్యాలయానికి వెళ్లి లైఫ్ సర్టిఫికెట్టు పూర్తిచేసి ఎస్టీవోకు అందించాల్సి ఉంటుంది. మధ్యవర్తుల ద్వారా పంపితే అనుమతించరు.
👉 ముఖ ప్రతిపాదనలు
💥 పెన్షన్దారులకు లైఫ్ సర్టిఫికెట్టు అందించే విషయంలో ముఖ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదనలు పంపాం. దీనిపై ఉత్తర్వులు రావాల్సి ఉంది. వేలి ముద్రలు పడనివారికి ముఖ యాప్ ఎంతో ఉపయోగకరం. ప్రస్తుతం జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా మాత్రమే తీసుకుం టున్నాం. నేరుగా లైఫ్ సర్టిఫికెట్టు ఇచ్చినా అభ్యంతరం లేదు.
👉 జిల్లాలో దాదాపు 16 వేల మంది పింఛన్ పొందుతున్నారు. వీరందరూ లైఫ్ సర్టిఫికెట్లు అందిస్తే పెన్షన్కు ఎటువంటి ఇబ్బందిరాదు.
👉 గతంలో లైఫ్ సర్టిఫికెట్లపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించి సమర్పించేవారు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో ఆన్లైన్లో నమోదుకు అవకాశాన్ని కల్పించారు.
👉 పోస్టాఫీస్ల ద్వారా, మీ సేవ కేంద్రాలు, బ్యాంకులు, పెన్షనర్స్ అసోసి యేషన్ ద్వారా ఆన్లైన్లో జీవన ప్రమాణ్ యాప్ ద్వారా వేలి ముద్ర వేస్తే చాలు సంబంధిత వివరాలు ఖజనా శాఖకు చేరుకుంటుంది.
👉 గతేడాది నవంబరులో పెన్షన్ కోసం వేలి ముద్రలు వేసి పెన్షన్దారులు తప్పనిసరిగా ఫిబ్రవరి నెలాఖరులోగా మరోసారి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.
👉 లేకపోతే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. పెన్షన్దారులు దేశంలో ఎక్కడ ఉన్నా దగ్గరలోని ఖజానా కార్యాలయం వద్ద కాని, జీవన ప్రమాణ్ పోర్టర్ ద్వారా వేలిముద్ర వేస్తే చాలు.
👉 ఒకవేళ ఇతర దేశాల్లో ఉన్నా మన దేశానికి సంబంధించిన జీవన ప్రమాణ్ యాప్ అనుమతి ఉంటే అక్కడ నుంచి వేలి ముద్ర వేస్తే చాలు.
👉 యాప్ అనుమతి లేని దేశాల్లో అక్కడ ఉన్న భారతీయ ఎంబసీ కార్యాలయం లో ఇస్తే వారు పోస్టల్ ద్వారా ఇక్కడ పంపుతారు. అదికూడా పరిగణలోకి తీసు కుంటారు.