👉Hyderabad: పేషెంట్ కేర్ (జీడీఏ)ఆసుపత్రి బిల్లింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు కల్పించేందుకు కిమ్స్ ఫౌండేషన్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ఎవరైనా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో 4 నెలల పాటు శిక్షణ పొందవచ్చు.
👉టెక్ మహీంద్రా ఫౌండేషన్ సహకారంతో ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
👉 18 నుంచి 30 ఏళ్లలోపు వయసున్న యువతీ యువకులు ఎవరైనా దరఖాస్తుకు అర్హులన్నారు.
👉మెడికల్ బిల్లింగ్, మెడికల్ టెర్మినాలజీ, స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, పేషెంట్ కేర్, సాఫ్ట్స్కేల్స్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు.
👉 ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకు 80198 16641, 82472 55859 నంబర్లు ఫోన్ చేయవచ్చని తెలిపారు లేదంటే సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని కిమ్స్ ఆసుపత్రిలో సంప్రదించాలని సూచించారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.
👉Telegram Link: