👉ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి జారీచేసిన డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్నది.
👉 రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 5,085 టీచర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 6న పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీచేసింది.
👉ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ ఏర్పాట్లు...
▪️ఆన్లైన్లో అక్టోబర్ 21 వరకు దరఖాస్తులకు గడువు...
▪️ నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలు
▪️11 కేంద్రాల్లో (సీబీటీ) CBT పద్ధతిలో నిర్వహిస్తారు.
👉 సెప్టెంబర్ 20 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. అక్టోబర్ 21 వరకు ఆన్లైన్లోనే స్వీకరిస్తారు.
👉 నవంబర్ 20 నుంచి 30 వరకు నియామక పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారమే వయో పరిమితి సడలింపు వర్తిస్తుంది.
👉అర్హతలు - నిబంధనలు:
▪️ఎస్జీటీ పోస్టులకు కేవలం డీఎడ్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు.
▪️స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బీఎడ్ సంబంధిత మెథడ్లో పూర్తిచేసిన వారు అర్హులు. నాలుగేండ్ల బీఎడ్ పూర్తిచేసిన వారూ పోటీపడొచ్చు. ఆయా కోర్సుల్లో జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు 50 శాతం, రిజర్వ్డ్ క్యాటగిరీ అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
▪️పీఈటీ పోస్టులకు అభ్యర్థులు ఇంటర్లో 50 శాతం మార్కుల తో ఉత్తీర్ణులై ఉండాలి. యూజీ డీ పీఈడీ కోర్సు కూడా పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ అభ్యర్థులు బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
▪️బీఎడ్, డీఎడ్ చివరి సంవత్సరం, చివరి సెమిస్టర్ చదివే అభ్యర్థులు సైతం దరఖాస్తులు సమర్పించవచ్చు.
▪️దరఖాస్తు ఫీజుగా రూ.1,000. అదనపు ఉద్యోగాలకు ఒక్కోదానికి రూ.1,000 చొప్పున చెల్లించాలి.
▪️అభ్యర్థులకు గరిష్ఠ వయో పరిమితి 1-7-2023 నాటికి 44 సంవత్సరాల వయసు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లు, మాజీ సైనికులకు 3, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5, దివ్యాంగులకు 10 ఏండ్ల వయో సడలింపు వర్తింస్తుంది.
▪️ నియామక రాత పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో అక్టోబర్ 20 నుంచి 30 వరకు నిర్వహిస్తారు.
▪️సంగారెడ్డి పట్టణంతోపాటు అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి.
▪️దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థి విద్యార్హతలు, వ్యక్తిగత సమాచారం, ఫొటో, సంతకాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
▪️తెలంగాణ, ఏపీ టెట్, లేదా సెంట్రల్ టెట్ (సీటెట్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
👉Website : https://schooledu.telangana.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: